ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేసి 45 రోజులకు పైగా అవుతుంది. ఇప్పటివరకు రూ. 3.40లక్షల బిల్లులు మాత్రమే వచ్చాయి. ఆఖరి బిల్లు రాలేదు. వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఇంటి నిర్మాణానికి తెచ్చిన అప్పు వడ్డీ ఎక్కువ అవుతుంది. ప్రభుత్వం పూర్తి బిల్లు చెల్లించి ఆదుకోవాలి.
– టి.మణెమ్మ, జింకలపల్లి,
ఇటిక్యాల మండలం
త్వరలోనే విడుదల..
జిల్లావ్యాప్తంగా 1,209 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఉపాధి హామీ పథకం ద్వారా త్వరలోనే నిధులు విడుదల కానున్నాయి. లబ్ధిదారులకు త్వరగా బిల్లులు అందేలా చర్యలు తీసుకుంటాం.
– నరేందర్, డీఈఈ, హౌసింగ్‌శాఖ


