సాగు ఆశలు తీర్చేలా..
రైతన్న పంట పండేలా..
పాలమూరు మురిసేలా..
పుడమితల్లి మెరిసేలా..
కృష్ణా మండలంలోని గుడేబల్లూరు వద్ద కృష్ణానదిలో పారుతున్న వరద నీరు
కరువును పారద్రోలేలా..
కృష్ణమ్మ వచ్చింది అంటూ అన్నదాతలు సంబరపడ్డారు. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి రెండు రోజుల క్రితం దిగువకు నీటిని విడుదల చేయగా.. శనివారం తెల్లవారుజామున రాష్ట్రంలోని మొట్టమొదటి గ్రామమైన తంగిడి వద్ద తెలంగాణలోకి అడుగుపెట్టింది. కృష్ణానదిలో నీటిని చూసిన తీర
ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పంటలకు అవసరమయ్యే నీరు వచ్చిందని.. ఎల్‌నినోపై దిగులు పోయిందని అభిప్రాయపడుతున్నారు.
– కృష్ణా


