రాజోళి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్, కస్తూర్బాగాంధీ పాఠశాలలను డీఈఓ విజయలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం, వారికి అందుతున్న వసతులు గురించి ఆరా తీశారు. ఈ ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఇన్‌చార్జి డీఎస్‌ఓగారేవంత్‌చంద్ర
గద్వాల: నాగర్‌కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్‌చంద్రకు వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఆయన శుక్రవారం గద్వాల కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాఖ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
గద్వాల మార్కెట్ సమాచారం
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు శుక్రవారం 849 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టం రూ.7,209, కనిష్టం రూ.3,224, సరాసరి రూ.5,469 ధరలు పలికినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మహాధర్నా
గద్వాల న్యూటౌన్: ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో ఆగస్టు 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక అభ్యసన ఉన్నత పాఠశాలలో మహాధర్నా వాల్‌పోస్టర్లను నాయకులతో కలిసి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దు, జీఓ 317 బాధితులకు విముక్తి తదితర ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి నాగరాజు, ఇతర నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


