విద్యారంగంలో జిల్లాను అగ్రగామిగా ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగంలో జిల్లాను అగ్రగామిగా ఉంచాలి

Jul 25 2026 12:47 AM | Updated on Jul 25 2026 12:47 AM

గద్వాల: ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసి విద్యారంగంలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌ సూచించారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మూడు రోజుల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మా ట్లాడుతూ.. శిక్షణలో నేర్పించే బోధన, అభ్యసన నైపుణ్యాలతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. చదువులో వెనకబడ్డ విద్యార్థులకు ప్రత్యే క శ్రద్ధ పె ట్టాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి మైఖేల్‌, శిక్షకులు గోపాల్‌, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

ఆరుతడి పంటలు సాగుచేయాలి

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు ఖరీఫ్‌లో ఆరుతడి పంటలు సాగుచేసేలా వారికి అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌ వ్యవసాయాధికారులను ఆదేశించారు. యూనిఫాం, వర్షపాతం, వ్యవసాయ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు నిర్వహించిన వీసీలో పాల్గొన్న ఆయన అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు విత్తనమేళాలను నిర్వహించనున్నట్లు, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement