మల్దకల్: గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలను త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని బిజ్వారం, మేకలసోంపల్లి గ్రామాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో భగీరథ తాగునీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వాటర్‌సప్లయ్ చేసే సిబ్బందితో మాట్లాడారు. బిజ్వారం పంచాయతీకి సంబంధించిన రికార్డుల నిర్వాహణలో జాప్యం వహించడంపై పంచాయతీ కార్యదర్శికి మెమోను అందజేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంపీఓ జాకీర్, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


