గద్వాలన్యూటౌన్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజురియింబర్స్‌మెంట్‌కు సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి డీకే బంగ్లాలో మాట్లాడుతూ.. వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఉద్యమ కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా జూలై 25, 26 న జిల్లా కేంద్రాల్లో 500 మంది విద్యార్థులతో గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి, సంతకాల సేకరిస్తామన్నారు. ఆగస్టు 7 నుంచి 12 వరకు జిల్లా కేంద్రాల్లో 5 వేల మంది విద్యార్థులతో ర్యాలీ చేస్తామని తెలిపారు. ఆగస్టు 17, 18 తేదీల్లో కళాశాల విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నివాసాల ముట్టడి ఉంటుందని వివరించారు. అనంతరం కార్యాచరణ వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట్రాములు, శ్యామ్‌రావు, బాబుల్ రెడ్డి, సమతగౌడ్, అనిల్ పాల్గొన్నారు.


