సీపీఎస్‌తో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌తో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం

Jul 17 2026 1:22 AM | Updated on Jul 17 2026 1:22 AM

గద్వాల న్యూటౌన్‌: సీపీఎస్‌ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో జిల్లాకేంద్రంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న జనజాగరణ యాత్రలో అన్నిశాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు నాగార్జునగౌడ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ ఆవరణలో కలెక్టరేట్‌ ఏఓ మంజులవాణి, ఇతర సీపీఎస్‌ నాయకులతో కలిసి యాత్ర వాల్‌పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్‌ అనేది ఉద్యోగుల ప్రాథమిక హక్కు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని భేషరతుగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 2004లో ప్రవేశపెట్టిన సీపీఎస్‌ విధానంతో 22 ఏళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక భద్రత కల్పించడంలో సీపీఎస్‌ పూర్తిగా విఫలమైందని, కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేయాలని నినదించారు. సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్‌ నుంచి బైక్‌ ర్యాలీ పాతబస్టాండ్‌ వరకు ఉంటుందని తెలిపారు. యాత్రలో సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు శ్రీనివాసరెడ్డి, ఎల్లస్వామి, లక్ష్మీనారాయణ, మస్తాన్‌, మురళి, పరశురాం, నవీన్‌రెడ్డి, చిరంజీవినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement