మత్తు రహిత సమాజ స్థాపనకు కృషి | - | Sakshi
Sakshi News home page

మత్తు రహిత సమాజ స్థాపనకు కృషి

Jul 17 2026 1:22 AM | Updated on Jul 17 2026 1:22 AM

అలంపూర్‌: మత్తు పదార్థాల రహిత సమాజ స్థానపకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ అధికారి సునంద అన్నారు. గురువారం అలంపూర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌– వికసిత్‌ భారత్‌కి పెహచాన్‌’ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి శాపం అన్నారు. పిల్లలు, యువత భవిష్యత్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. మత్తు పదార్థాల వ్యసనంతో కుటుంబాలు ఆర్థిక, సామాజిక సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని, సమాజంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్యాలు, నేరాలపై దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన పెంపొందించి వాటికి దూరంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఎక్కడైనా మత్తు పదార్థాల వినియోగం, వాడకం గుర్తిస్తే 1908 టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీసీపీఓ నర్సింహ, ఎస్‌ఐ రామకృష్ణ, కమ్యూనిటీ ఎడ్యుకేటర్‌ కృష్ణ, ప్రిన్సిపల్‌ దేవేందర్‌రెడ్డి, సూపర్‌వైజర్‌ సారగిన్‌, అధ్యాపకులు మౌనిక, పూర్ణిమ, రాజు, వెంకట్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement