హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించకపోవడంతో రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ట్రాఫిక్‌జాం కారణంగా ఇంధన వినియోగం పెరుగుతోంది. వాహనాలు ఎక్కువ సమయం రోడ్డుపై గడపడంతో వాటి నిర్వహణ ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. వ్యాపారులకు సరుకుల రవాణా ఆలస్యం కావడంతో ఆర్థిక నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా అంబులెన్స్ వాహనాలకు ఆటంకం కలుగుతుంది.
– నజీర్, అయిజ
సామాజిక ప్రభావం..
అంతర్రాష్ట్ర రహదారులపై హైలెవల్ బ్రిడ్జిలు లేకపోవడంతో స్థానిక సమాజాల మధ్య అనుసంధానం తగ్గిపోతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు ప్రయాణం కష్టతరమవుతుంది. విద్య, ఉపాధి, వైద్య సౌకర్యాలకు ఆటంకం ఏర్పడుతోంది. ముఖ్యంగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు రాలేకపోవడంతో ఆస్తి, ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది.
– రవీంద్రనాథరెడ్డి, అయిజ
కాంట్రాక్టర్ల
నిర్లక్ష్యమే..
హైలెవల్ బ్రిడ్జి నిర్మా ణం సగభాగం పూర్తిచేసినా సరే వాటికి సంబంధించిన బిల్లు లు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు పనులు మధ్యలో నిలిపివేస్తున్నారు. అయిజ సమీపంలోని కాజ్‌వే నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పను లు ప్రారంభిస్తాం.
– అల్తాఫ్,
ఆర్‌అండ్‌బీ ఏఈ, అయిజ
●


