మల్దకల్: మండలంలోని కుర్తిరావులచెర్వు గ్రామంలో మంగళవారం విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కూడిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్గం ఏర్పాటు చేసింది. అయితే టీజీఎస్‌జీడీసీఎఫ్‌ఎల్ చైర్‌పర్సన్ సరిత వర్గం వారు బహిరంగ సభ ప్రాంతంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా ఎమ్మెల్యే వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. సీఐ టంగుటూరి శ్రీను, ఎస్‌ఐలు ఇరువర్గాల వారితో మాట్లాడి అదుపుచేయడంతో గొడవ సద్దుమణిగింది.


