పేర్లు మారేనా! | - | Sakshi
Sakshi News home page

పేర్లు మారేనా!

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

సింగరేణి వ్యాప్తంగా 6వేల మంది.. డిపెండెంట్‌ ఉద్యోగాలపై ప్రభావం...

హామీ నెరవేర్చని ఏఐటీయూసీ

ప్రభుత్వాన్ని కోరుతున్న

కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలు..

సింగరేణిలో ఏళ్లతరబడి ఎదురుచూపు

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణిలో మారుపేర్లపై విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సొంత పేర్లు మారుస్తామన్న హామీ సంవత్సరాలు గడుస్తున్నా నెరవేరడం లేదు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా హామీ ఇచ్చినా నెరవేరలేదు. పేర్ల మార్పిడి విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ ప్రక్రియ అంతటితోనే నిలిచిపోయింది. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, గుర్తింపు, ప్రాతినిథ్య ఎన్నికల్లో గెలుపొందిన సంఘాలు సైతం హమీ ఇచ్చాయి. కానీ అమలుకు నోచుకోవడం లేదు.

సింగరేణి వ్యాప్తంగా మారుపేర్లతో విధులు నిర్వహిస్తున్న వారు సుమారు 6వేల వరకు ఉండగా భూపాలపల్లి ఏరియాలో 450 మంది వరకు ఉంటారని సమాచారం. వీరంతా సుమారు 40 సంవత్సరాల క్రితం విధుల్లో చేరినప్పటి నుంచి సొంత పేర్లకు నోచుకోవడం లేదు. నిరక్ష్యరాస్యులు కావడంతో ఆ రోజుల్లో పేర్ల నమోదు సరిగా చేసుకోలేదు. కులం పేరుతో పిలవబడే పేరుతోనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐఆర్‌లో సైతం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మారుపేర్లతో కార్మికులు ఉద్యోగాలు చేస్తుండగా.. పిల్లలపై దాని ప్రభావం అధికంగానే పడుతోంది. కార్మికుల పిల్లల్లో ఉన్నత చదువులు చదివిన వారు అనేక మంది ఉన్నారు. వారి సర్టిఫికెట్లన్నీ సొంత పేర్లతోనే ఉన్నాయి. తండ్రి ఇంటి పేరులో దొర్లిన తప్పుల కారణంగా పిల్లల చదువుల్లోనూ దాని ప్రభావం పడుతోంది. సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలకు అవకాశాలు ఉండటంతో మారుపేర్లతో ఉన్న కార్మికుల పిల్లలు కొలువులో చేరేందుకు కూడా అడ్డంకిగా మారింది. అనారోగ్య కారణాలతో కార్మికులు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ అయిన సందర్భంలో తన తండ్రి పేరులో అక్షర దోషం ఉందనే సాకుతో పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి అధికారులు నిరాకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి కేసులు కొత్తగూడెం కార్పొరేట్‌ విజిలెన్స్‌ విభాగం కార్యాలయంలో ఆరు వేలకు పైగా పెండింగులో ఉన్నాయి.

దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందోనని వందలాది కార్మిక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ప్రాతినిథ్య సంఘంగా ఎన్నికై న ఏఐటీయూసీ సమస్యను పరిష్కారిస్తామని హమీ ఇచ్చింది. గుర్తింపు సంఘం పదవి కాలం ఇటీవల ముగిసినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సింగరేణిలో మారుపేర్ల మార్పిడి జరిగితే వందలాది కార్మికుల పిల్లలకు డిపెండెంట్‌ ఉద్యోగాలు లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డిపెండెంట్‌ ఉద్యోగాలపైనా తీవ్ర ప్రభావం

ప్రభుత్వం పట్టించుకోవాలంటున్న కార్మికులు

సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మారుపేర్ల సమస్య అతి ముఖ్యమైనది. మారుపేర్లను సవరించాలని రాష్ట్రంలోని కోల్‌బెల్ట్‌ ప్రాంత ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సైతం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ మారుపేర్లను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement