ఆయుర్వేద వైద్యశాలలో హౌస్‌ సర్జన్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఆయుర్వేద వైద్యశాలలో హౌస్‌ సర్జన్ల నిరసన

Jul 31 2026 12:39 AM | Updated on Jul 31 2026 12:39 AM

కాశిబుగ్గ: స్టైఫండ్‌ పెంచాలని కోరుతూ తెలంగాణ ఆయుష్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో హౌస్‌సర్జన్లు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ నిరసన చేపట్టారు. ఆయుష్‌ హౌస్‌సర్జన్లు అల్లోపతిక్‌ హౌస్‌సర్జన్లతో సమానంగా రోగులు సేవలు అందిస్తూ, అత్యవసర విధులు, వార్డులు, ఓపీలను సమర్థంగా నిర్వహిస్తున్నప్పటికీ స్టైఫండ్‌ విషయంలో వివక్ష చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్టైఫండ్‌తోపాటు బకాయిలను విడుదల చేసి, ప్రతినెలా సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement