భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘నషా ముక్త్ భారత్’ జిల్లా స్థాయి వివిధ పోటీలలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో బహుమతులు కై వసం చేసుకున్నారు. ఫోక్ డాన్స్ విభాగంలో బన్విత గ్రూప్ ప్రథమ స్థానం, పోయేట్రీ రైటింగ్ విభాగంలో సహస్ర ప్రథమ బహుమతి, స్కిట్ విభాగంలో జాన్ లింకన్ గ్రూప్ ద్వితీయ స్థానం, షార్ట్ ఫిల్మ్ విభాగంలో మణికంఠ గ్రూప్ ద్వితీయ బహుమతి, స్లోగన్ రైటింగ్ విభాగంలో వైష్ణవి తృతీయ స్థానం, డ్రాయింగ్ విభాగంలో పిర్దౌష్ తృతీయ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీప్రసన్న గెలుపొందిన విద్యార్థులను అభినందించి, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమేశ్, కోమల, సర్వోత్తమ్‌రెడ్డి, ఈశ్వరమ్మ, శ్రీవాణి, రాజయ్య, రామకృష్ణ, సురేష్, చంద్రమౌళి, గురుతేజ, నస్మా సుల్తానా, పుష్పలత, రాంధన్ పాల్గొన్నారు.


