కోల్డ్‌ స్టోరేజీలోని మిర్చి నిల్వలపై ఆరా | - | Sakshi
Sakshi News home page

కోల్డ్‌ స్టోరేజీలోని మిర్చి నిల్వలపై ఆరా

Jul 9 2026 6:35 AM | Updated on Jul 9 2026 6:35 AM

ఖిలా వరంగల్‌: రూ.8 కోట్లకు పైగా మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారైన ఓ వ్యాపారి, కోల్డ్‌స్టోరేజీలోని మిర్చి నిల్వల గురించి బుధవారం బాధిత రైతులు, పోలీసులు ఆరాతీశారు. నగరంలోని ఓ కోల్డ్‌స్టోరేజీలో మిర్చి బస్తాల నిల్వలు ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. సదరు వ్యాపారిపై చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో బాధిత రైతులు ఫిర్యాదు చేయగా కోల్డ్‌స్టోరేజీలో భద్రపర్చిన నిల్వలను చిట్యాల సీఐ మల్లేశ్‌యాదవ్‌ పరిశీలించారు. బాధిత రైతులకు డబ్బులు చెల్లించాలని కోరుతూ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎర్ర ప్రియాంక, వైస్‌ చైర్మన్‌ బండి జనార్దన్‌, పాలకవర్గ సభ్యులు, వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులతో సీఐ సమావేశమయ్యారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి అడ్తి వ్యాపారుల పక్షాన నిలిచారు. పరారైన వ్యాపారి నుంచి అడ్తి వ్యాపారి వేణు 545 మిర్చి బస్తాలను నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి శీతల గిడ్డంగిలో భద్రపర్చుకున్నాడని స్పష్టం చేశారు. పరారైన వ్యాపారి.. వేణు వద్ద సరుకు కుదువ పెట్టి రూ.33 లక్షల తీసుకున్నాడని పోలీసులకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement