రెండురోజుల వర్షపాతం (మి.మీలో)
పత్తి పంటలకు జీవం పోశాయి..
ప్రధాన పంటల సాగు అంచనా (ఎకరాల్లో)...
25,000
మిర్చి
వరి 1,09,854
పత్తి 1,08,560
భూపాలపల్లి రూరల్: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వానలు పత్తి పంటలకు ప్రాణంపోశాయి. గత నెలలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. దీంతో పత్తి మొలకలు ఎండిపోయే దశలో ఉండగా రెండు రోజులుగా చిరుజల్లులు పడుతుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ముందే కురిసి.. ముఖం చాటేసి..
జిల్లాలో జూన్ మెదటి వారంలో రెండు మూడు వర్షాలు పడటంతో రైతులు వానలు కురుస్తాయన్న నమ్మకంతో కొందరు పత్తివిత్తనాలు విత్తారు. మరికొందరు దుక్కులు దున్ని సిద్ధం చేసుకోగా అనంతరం వర్షాలు మొఖం దాటేశాయి. దీంతో రైతులంతా ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో జలకళ సంతరించుకునే అవకాశాలున్నాయి.
పత్తికి అనుకూలంగా..
నెల రోజుల క్రితం సాగు ప్రారంభించిన భూముల్లో పత్తి పంట మొలక దశలో ఉంది. వర్షాలు లేకపోవడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు. పలుచోట్ల పత్తి మొలకలు ఎండిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పత్తి పంటకు ప్రాణం పోస్తున్నాయి. ప్రతీరోజు వర్షం కురుస్తుండటంతో రైతులు పత్తి పంటలో పోగుంటలు పెడుతున్నారు. వానలతో వరి నార్లు పోసుకోవడం ముమ్మరం కానుంది. చెరువులు, కుంటల్లో నీటిమట్టం పెరిగితే వరిసాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
మండలం బుధ గురు
మహదేవపూర్ 23.4 28.2
పలిమెల 25.4 28.2
మహాముత్తారం 11.8 6.4
కాటారం 19.8 7.6
మల్హర్ 39.4 00
భూపాలపల్లి 25.6 00
చిట్యాల 6.0 2.4
టేకుమట్ల 7.4 00
మొగుళ్లపల్లి 6.0 0.8
రేగొండ 5.8 6.4
గణపురం 6.2 00
రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పత్తి పంటలకు ప్రాణం పొసినట్లయింది. మొదట్ల వాన కొట్టిన తర్వాత వానలు కొడుతాయని ఆశతో పత్తివిత్తనాలు విత్తాము. కానీ పడలేదు. పత్తి గింజలు ఎండిపోతాయనుకన్నాం కానీ నిన్న, మొన్న కురిసిన వానలతో పత్తి గింజలు మొలకెత్తుతాయి.
– గూడెపు లింగయ్య, జంగేడు, భూపాలపల్లి


