స్వర్ణకారుల అభివృద్ధికి కృషి
● శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో స్వర్ణకారుల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి తెలిపారు. జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో స్వర్ణకార సంఘం భవనానికి తన నిధుల నుంచి రూ.20లక్షల నిధులు కేటాయిస్తానని తెలిపారు. స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు, దొంగ బంగారం పేరుతో స్వర్ణకారులపై వేధింపులను ఆపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.


