
ఒడంబడిక!
నిట్ వరంగల్‌లోని బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏలతో పాటు పీహెచ్‌డీ విద్యను అభ్యసిస్తున్న సుమారు 6 వేల మంది విద్యార్థులకు ఇతర పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్‌షిప్, విద్యా పరస్పర బదిలీలకు, టెక్నాలజీ ఉపయోగానికి ల్యాబ్స్ సౌకర్యం, ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఎంఓయూలు తోడ్పాటునందిస్తున్నాయి. ఇక్కడి విద్యార్థులకు వివిధ సంస్థల్లో విద్యను అభ్యసించే అవకాశం వీటి ద్వారా లభిస్తోంది.
అంతర్జాతీయ ప్రమాణాలు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశాలు. ప్రపంచాన్ని చుట్టి రావాలన్నా.. నూతన సాంకేతికతలో రాటుదేలాలన్నా.. సరికొత్త ఆవిష్కరణల్ని రూపొందించాలన్నా.. జీవితంలో బాగా స్థిరపడాలన్నా విద్యార్థులకు కల్పతరువు నిట్ వరంగల్. ఇక్కడ సీటు వస్తే చాలు.. లైఫ్ సెట్ అనుకుంటారు. అలాంటి క్యాంపస్‌తో వివిధ పరిశ్రమలు, కంపెనీలు ఎంఓయూలు చేసుకునేందుకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు నిట్.. ఆఫ్‌లైన్‌లోనే కాదు.. వర్చువల్‌గా పరస్పర ఒప్పందాలు చేసుకుంటూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది.
– కాజీపేట అర్బన్
ఎంఓయూలో ‘వరంగల్ నిట్’ కొత్త ధోరణి
అటు వర్చువల్‌గా,
ఇటు నేరుగా ఒప్పందాలు
సరికొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉద్యోగావకాశాలకు తోడ్పాటు
ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, విస్తరించే దిశగా ప్రయత్నాలు
ప్రత్యేకతను చాటుకుంటున్న సాంకేతిక సంస్థ