
రామప్ప శిల్పకళ మరుపురానిది..
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద మరుపురానిదని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ సామ్ కోషి కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామిని శ్రీనివాస్‌రావు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి జస్టిస్ శ్రీనివాస్‌రావుకు గైడ్ విజయ్‌కుమార్, జస్టిస్ సామ్ కోషికి గైడ్ వెంకటేశ్ వివరించారు. ఈ సందర్భంగా వారు శిల్పకళ సంపద బాగుందని వివరించారు. వారి వెంట ములుగు జిల్లా జడ్జి సూర్య చంద్రకళ, భూపాలపల్లి జడ్జి దిలీప్‌కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం ఉన్నారు.
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్
శ్రీనివాస్‌రావు, జస్టిస్ సామ్ కోషి

రామప్ప శిల్పకళ మరుపురానిది..