
నేడు రెండో వార్షికోత్సవం
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన నందీశ్వరుడికి ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రెండవ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో నందీశ్వరుడు పూర్తిగా ధ్వంసం కావడంతో దాతల సహాయంతో రెండు సంవత్సరాల క్రితం విగ్రహం ఏర్పాటు చేశారు. నందీశ్వరుడికి త్రివేణి సంగమం జలాలతో అభిషేకం, రుద్రాభిషేకం, గణపేశ్వరుడికి బిల్వార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని కోరారు.
భూపాలపల్లి అర్బన్: శరీర, అవయవ దానానికి ముందుకురావాలని అమ్మ నేత్ర, అవయన, శరీరదాన ప్రోత్సాహకాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈశ్వరలింగం కోరారు. ఆత్మీయత సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరలింగం మాట్లాడు తూ.. నేత్ర, అవయవ, శరీరదానాలపై ఉన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. శరీర, అవయవ దానాలు చేయడం వలన మరి కొంత మంది ప్రాణాలను కాపాడిన వారిగా గుర్తింపు పొందుతారని అన్నారు. అనంతరం అవయవదాన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయత సేవా సొసైటీ అధ్యక్షుడు బయ్యన మహేందర్, సభ్యులు క్రాంతికుమార్, షాకీర్, తిరుపతి, బండి శ్రీని వాస్, కుమారస్వామి, రమేష్ పాల్గొన్నారు.
రేగొండ: మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలతో డప్పులు, వాయిద్యాల మధ్య ఆలయానికి వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని బోనా ల నైవేద్యాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్/జనగామ: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షి ఫొటోగ్రాఫర్లను రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. వరంగల్‌కు చెందిన సాక్షి సీనియర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ పెద్దపల్లి వరప్రసాద్, జనగామ ఫొటోగ్రాఫర్ గోవర్ధనం వేణుగోపాల్ ఉత్తమ వార్త చిత్రాల పోటీల్లో బహుమతులకు ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.

నేడు రెండో వార్షికోత్సవం

నేడు రెండో వార్షికోత్సవం