భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శనివారం భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు పరిశీలించారు. పోలీస్ ఔట్ పోస్ట్, సెక్యూరిటీ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం, ఐసీయూలో అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పిల్లల వార్డులు, ఇతర వార్డులోకి వర్షపు నీరు వచ్చిన విషయమై సంబంధిత ఏఈ రవికిరణ్‌తో మాట్లాడారు. మూడవ అంతస్తు నిర్మాణంలో ఉన్నందున ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేష్‌కుమార్, ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.