
ఉప్పొంగిన మోరంచ వాగు
గణపురం: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మండలవ్యాప్తంగా 30 చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. మండలంలో 66 చెరువులు కుంటలు ఉండగా.. ధర్మరావుపేట ఊరచెరువు, బుద్దారం వంగపెల్లి చెరువు, నగరంపల్లి చెరువులతో పాటు 30 కుంటలు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. గణపసముద్రం చెరువు నీటి మట్టం 18 ఫీట్లకు చేరుకుంది. మండలంలో మోరంచవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో సమీపంలోని వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వర్షాలు లేక వెలవెలబోయిన చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు పోస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.