
కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం అనుబంధ దేవాలయంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప, నవగ్రహాల వద్ద శని నివారణ పూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. శనివారం ఉదయం త్రివేణి సంగమ గోదావరిలో స్నానాలు చేసి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి ఽశ్రావణమాసం సందర్భంగా అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.
భూపాలపల్లి రూరల్: మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ బొడ్డు దయాకర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఆరిశంస్వామి మాదిగ, ప్రధాన కార్యదర్శిగా శనిగరపు భద్రయ్య, కోశాధికారిగా మోరె కుమారస్వామి మాదిగలను ఎన్నుకున్నట్లు దయాకర్ తెలిపారు. మాదిగ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని తెలిపారు.
మల్హర్: రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి తల్లి లక్ష్మిబాయి దశదిన కర్మ కార్యక్రమానికి శనివారం మంత్రి గడ్డం వివేక్ హాజరై ప్రకాశ్‌రెడ్డిని పరామర్శించారు. మండలంలోని వల్లెకుంట గ్రామంలో లక్ష్మీబాయి చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిత రాజిరెడ్డి, నాయకులు, మంత్రి అభిమానులు పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ వనదేవతలను ఛత్తీస్‌గఢ్ బీజేపీ నేతలు శనివారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బీజాపూర్ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, బస్తర్ జిల్లా ఇన్‌చార్జ్ గుజ్జ వెంకటర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా బీజాపూర్ జిల్లా పార్టీ నాయకులు ఆయనతో కలిసి ఆమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.