జనగామ: ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరు విషయంలో ప్రజలు ఆధారాలు లేని వదంతులను నమ్మొద్దని జనగామ ము న్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇళ్ల మంజూరు పేరుతో ఓ లబ్ధిదారురాలి నుంచి రూ.లక్ష డిమాండ్ చేసినట్లు వచ్చిన సమాచారంపై కమిషనర్ స్పందించారు. సంబంధిత లబ్ధిదా రురాలిని పిలిపించి విచారించినట్లు తెలిపారు. విచారణలో మున్సిపల్ ఉద్యోగులు ఎవరూ తన ఇంటికి రాలేదని, ఎవరూ డబ్బులు అడగలేదని, తాను ఎవరికీ డబ్బులు చెల్లించలేదని లబ్ధిదారురాలు స్పష్టం చేసినట్లు కమిషనర్ తెలిపారు. అయితే గుర్తుతెలియని వ్యక్తి తన ఇంటికి వచ్చి రూ.లక్ష అడిగినట్లు ఆమె వెల్లడించిందన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఇందిరమ్మ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, డ్రా విధానంలో నిర్వహిస్తున్నామన్నారు. ఇళ్ల మంజూరు పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఆధారాలతో మున్సిపల్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదులపై విచారణ జరిపి వాస్తవాలు నిర్దారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.
‘గాంధీ జయంతి రోజు
జీవ హింస చేయొద్దు’
జనగామ/స్టేషన్‌ఘన్‌పూర్: ఈనెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని జీవహింస చేయొద్దని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ము న్సిపల్ కమిషనర్‌లు రాజశేఖర్‌రెడ్డి, రాధాకృష్ణ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. పట్టణంలోని చికెన్, మటన్ సెంటర్ల వ్యాపారులు మాంసం విక్రయాలు చేయొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ట్రేడ్ లైసెన్స్ రద్దుతో పాటు రూ.10వేల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ముఖ్య కూడళ్లతో పాటు ప్రతీ వార్డులో నిఘా ఉంటుందన్నారు.
కటాస్‌లో గిన్నిస్ రికార్డు
పాలకుర్తి టౌన్: కరాటే కాటాస్ విభాగంలో ప్రతిభ కనబర్చి గిన్నిస్ రికార్డు సాధించారు మండలంలోని శాతపురంకు చెందిన మాస్టర్లు బానోతు బాలుకుమార్, భూక్య రమేష్. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లో కరాటే విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 2000 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. కాటాస్ విభాగంలో మాస్టర్లు బా లుకుమార్, రమేష్ అద్భుత ప్రతిభ కనబర్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ మేరకు బుధవారం మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాలుకుమార్, రమేష్‌లను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో రాపాక సత్యనారాయణ, పోగు శ్రీనివాస్, ఎండీ మదార్, యాక య్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
జాతర ఏర్పాట్లపై సూచనలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల జాతర ఏర్పాట్లపై బుధవారం జనగామ ఆర్డీఓ గోపీరామ్ అధికారులకు సూచనలు చేశారు. ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆధ్వర్యంలో నవంబర్‌లో జరిగే బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్డీఓ గోపీరామ్ ఆలయాన్ని సందర్శించారు. సానిటేషన్, గ్రీనరీ ఏర్పాట్లు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ఆర్డీఓ అధికారులకు సూచనలు చేశారు. తహసీల్దార్ అండాలు, ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి, డాక్టర్ ఉదయ్‌కిరణ్, ట్రాన్స్‌కో ఏఈ శంకరయ్య, ఈఓ వంశీ, దేవస్థాన చైర్మన్ మూర్తి తదితరులు ఉన్నారు.
జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరి ధిలో 2బీ బార్ ఏర్పాటుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అ బ్కారీ శాఖ అధికారి ఎన్. అంజిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బార్ లైసె న్స్‌నకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు దరఖాస్తులు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయం, కాజీపేట, కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, రాష్ట్ర కార్యాలయం, హైదారాబాద్‌లలో సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు రుసుం రూ.1లక్ష చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు వెబ్‌సైట్ టీజీబీసీఎల్.తెలంగాణ.జీవీఓ.ఇన్ లేదా జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి ఎన్.అంజిరెడ్డి (87126 58996), స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ (87126 59006)ను సంప్రదించవచ్చన్నారు.


