విద్యా ప్రమాణాలపై నిఘా! | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాలపై నిఘా!

Oct 1 2026 4:34 AM | Updated on Oct 1 2026 4:34 AM

ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌కు బదిలీతో బృందాల్లో మార్పులు ఉన్నత పాఠశాలలపై ప్రత్యేక దృష్టి ఏం పరిశీలిస్తారు? బోధనకు అంతరాయం కలగకుండా..

ఎంఈఓల పర్యవేక్షణ

పాఠశాలల వారీగా అకడమిక్‌ తనిఖీ బృందాలు

జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, బోధన, అభ్యసన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా విద్యాశాఖ అకడమిక్‌ ప్యానల్‌ ఇన్‌స్పెక్షన్‌ బృందాల జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి సందీప్‌ కుమార్‌ ఝా (ఐఏఎస్‌) ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సమగ్ర శిక్ష మార్గదర్శకాల మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అకడమిక్‌ మానిటరింగ్‌ నిర్వహించనున్నారు.

ఇప్పటికే ఏర్పాటు చేసిన అకడమిక్‌ ప్యానల్‌ బృందాల్లోని ఒక నోడల్‌ అధికారి, ప్రాథమిక పాఠశాల బృందంలోని ఒక సభ్యుడు, ప్రాథమికోన్నత పాఠశాల బృందంలోని మరో సభ్యుడు జిల్లా ఎఫ్‌ఎల్‌ఎన్‌ సెల్‌కు బదిలీ అయ్యారు. దీంతో వారు తనిఖీ విధులకు అందుబాటులో లేకపోవడంతో వారి స్థానంలో ప్రత్యామ్నాయ సభ్యులను నియమించి బృందాలను సవరించారు. నిర్దేశిత బృందం నిర్మాణాన్ని కొనసాగిస్తూ కొత్త జాబితాను ఆమోదించారు.

హైస్కూల్‌ అకడమిక్‌ ప్యానల్‌కు 103 పాఠశాలలను కేటాయించారు. నోడల్‌ అధికారిగా ఒబుల్‌కేశ్వాపూర్‌ ఉన్నత పాఠశాల గెజిటెడ్‌ హెచ్‌ఎం ఎన్‌.వాసుదేవరెడ్డిని నియమించారు. వివిధ సబ్జెక్టులకు చెందిన (శేషుకుమార్‌, కిషన్‌ కుమార్‌, రాంబాబు, శ్రీనివాస్‌, శ్రీనివాసచారి, సత్తయ్య, సుభాష్‌, వెంకటేశ్వర్లు) పాఠశాల సహాయకులను సభ్యులుగా నియమించారు. బహుళ సబ్జెక్టుల ఆధారంగా విద్యా ప్రమాణాలను పరిశీలించే విధంగా రూపొందించారు. అలాగే 64 ప్రాథమికోన్నత పాఠశాలలు, 93 ప్రాథమిక పాఠశాలలకు మూడు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి నోడల్‌ అధికారి, సభ్యులను కేటాయించారు.

అకడమిక్‌ తనిఖీల్లో తరగతి గది బోధన, ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన స్థాయి, ఉపాధ్యాయులు, విద్యార్థుల పరస్పర చర్యలు, విద్యా రికార్డులు, అకడమిక్‌ పద్ధతులను పరిశీలించనున్నారు. పాఠశాలల్లో ఉన్న విద్యాపరమైన లోపాలను గుర్తించి, పరిశీలన ఆధారంగా నిర్ణీత నమూనాలో నివేదికలు, అభిప్రాయాలను సమర్పించాల్సి ఉంటుంది.

తనిఖీ బృందం సభ్యులు తమ సొంత పాఠశాలల్లో పని చేస్తుండటంతో వారి గైర్హాజరీ సమయంలో విద్యార్థుల సాధారణ బోధనకు అంతరాయం కలగకుండా హెచ్‌ఎంలు, మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అదే పాఠశాల లేదా సమీప పాఠశాలల్లోని అందుబాటులో ఉన్న అదనపు ఉపాధ్యాయులతో వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేయాలని ఆదేశించారు.

జనగామ పట్టణంలోని ధర్మకంచ పీఎంశ్రీ

ఉన్నత పాఠశాల

నోడల్‌ అధికారులు తనిఖీలను సమన్వయం చేసి, కేటాయించిన పాఠశాలల కవరేజీ, రికార్డుల నిర్వహణ, తనిఖీ నివేదికల సమర్పణను పర్యవేక్షించాలి. మండల విద్యాశాఖ అధికారులు, పర్యవేక్షణ అధికారులు తనిఖీ కార్యక్రమంతో పాటు వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ అమలును కూడా పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో జిల్లాలో అకడమిక్‌ తనిఖీలకు పాఠశాల స్థాయి నుంచి తరగతి గది వరకు పరిశీలనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

విభాగం కేటాయించిన నోడల్‌ అధికారి సభ్యులవివరాలు

పాఠశాలలు

ఉన్నత పాఠశాలలు 103 ఎన్‌. వాసుదేవరెడ్డి బి.శేషుకుమార్‌, పి.కిషన్‌కుమార్‌,

బి. రాంబాబు, ఎం. శ్రీనివాస్‌,

ప్రాథమికోన్నత పాఠశాలలు 64 ఎం. లక్ష్మంజీ టి.హరిప్రసాద్‌, ఎన్‌.జయపాల్‌రెడ్డి

ప్రాథమిక పాఠశాలలు –టీమ్‌–1 93 చి.కన్నయ్య రమేష్‌, టి.సునీత

టీమ్‌–2 93 జి. మంజుల జి.కనకయ్య, వి.సంతోష్‌ కుమార్‌

టీమ్‌–3 93 ఈ. శ్రీవాస్‌రెడ్డి పి.పరశురాములు, ఎం.రాఘవులు

అకడమిక్‌ ప్యానల్‌ తనిఖీ బృందాలు ఖరారు

బోధన, అభ్యసన ప్రక్రియపై ప్రత్యేక దృష్టి

జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత,

ఉన్నత పాఠశాలల్లో పర్యవేక్షణ

తనిఖీలకు వెళ్లే టీచర్ల స్థానంలో వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement