చిల్పూరు: గండి రామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్–1 పనులను వేగవంతం చేసి జనవరిలో రెండో పంటకు సాగునీరు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులోని గండి రామారం లిఫ్ట్ పంప్‌హౌస్ నిర్మాణ పనులను బుధవారం నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 104 కోట్లతో గండి రామారం ఎత్తిపోతల ప్రా జెక్టు పనులను ప్రారంభించామన్నారు. గత పాలకులు లిఫ్ట్1, 3 పనులను పట్టించుకోలేదని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికై న వెంటనే అధికారులు, కాంట్రాక్టర్ల వెంట పబడి పనులు చేయిస్తున్నానన్నారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తి అయ్యాయని, మిగతా పనులు త్వరగా పూర్తి చేసి జనవరిలో రెండో పంటకు సాగునీరు అందివ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా పంపుహౌస్ వద్ద ఏ పనులు ఎవరు చేయాలో అధికారులకే స్పష్టత లేకపోతే ఎలా? శాఖల మధ్య సమన్వయ లోపం ఉంటే రైతులే ఇబ్బంది పడేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎట్టి పరిస్థితిలో జనవరిలో సాగునీరు అందివ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సీఈ సుధీర్, ఎస్‌ఈ సీతారాం, ఈఈ ప్రవీణ్, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్‌రా వు, మండల అధ్యక్షుడు చిర్ర నాగరాజు, ఎడవెల్లి మల్లారెడ్డి, వెన్నం రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు కరుణాకర్, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి


