నర్సంపేట: నర్సంపేటలోని హైస్కూల్ సమీపంలో 20 మంది యువకుల కమిటీతో ఏర్పడ్డ ప్రగతి నగర్ గణేశ్ ఉత్సవ కమిటీ 50 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. 1977లో ఏర్పడినప్పటి నుంచి కాలనీలోని సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొదట్లో తోపుడు బండిలో వినాయకుడిని ఏర్పాటు చేసుకోగా, ఆ తర్వాత ఎడ్లబండిపై నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. ప్రస్తుతం హైస్కూల్ సమీపంలో మండపాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు.
50 ఏళ్లక్రితం గణేశ్ ఉత్సవాలు
ప్రారంభించాం. మొదట్లో నిమజ్జనం చేసేందుకు తోపుడు బండి పై వినాయకుడిని తీసుకెళ్లేవాళ్లం. నిమజ్జన శోభాయాత్రలో ఆయిల్ డబ్బాను కొట్టుకుంటూ శబ్దాలు చేస్తూ వెళ్లేవాళ్లం. అప్పటి ఆనందమే వేరు. ప్రస్తుతం డీజే పెట్టాల్సి వస్తోంది. – గీత గోవిందం సురేశ్,
ఉత్సవ కమిటీ బాధ్యుడు


