డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు డ్రా | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు డ్రా

Sep 13 2026 1:00 AM | Updated on Sep 13 2026 1:00 AM

జనగామ రూరల్‌: స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌, లింగాలఘణపురం, జఫర్‌గఢ్‌ మండలాల పరిధిలో గల 108 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో డ్రా నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధ్యక్షతన డ్రా పద్ధతి ద్వారా పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక కోసం మూడు వనరుల నుంచి అర్హుల జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ఎల్‌ టూ జాబితా, ప్రజావాణి దరఖాస్తుదారులు, ప్రజా ప్రతినిధులు లిఖితపూర్వకంగా అందజేసిన పేర్లు ఈ మూడు జాబితాల్లోని ప్రతి అర్హత కుటుంబాన్ని ఏకీకృత జాబితాలో చేర్చినట్లు చెప్పారు. డ్రా అనంతరం ఎంపికై న కుటుంబా లకు తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసి, మండల స్థాయి బృందాలు అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయని తెలిపారు. అర్హత నిర్ధారణ అనంతరం తుది కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసి గృహాల స్వాధీనం కల్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్‌ ప్రకాష్‌, ఆడిట్‌ అధికారి దేవేందర్‌, తహసీల్దార్లు స్వప్న, శ్రీనివాస్‌, ఆండాలు పాల్గొన్నారు.

గణేష్‌ నిమజ్జనానికి

పకడ్బందీ ఏర్పాట్లు

జనగామ: గణేష్‌ ఉత్సవాల సందర్భంగా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల చెరువులో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీసీపీ రాజామహేంద్ర నాయక్‌ (ఐపీఎస్‌), ఆర్డీఓ గోపీరాం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాలమణిశ్రీనివాస్‌తో కలిసి వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న ట్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్‌ నియంత్రణ, పారిశుద్ధ్యం, విద్యుత్‌, తాగునీరు, లైటింగ్‌, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

నవోదయ ప్రవేశాలకు

దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతుల్లో లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు ఆన్‌లెన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జవహర్‌ నవోదయ విద్యాలయం పీఎం పాఠశాల మామూనూర్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ టి.రమేశ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి ప్రవేశానికి జవహర్‌ నవోదయ విద్యాలయం ఉన్న అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదివి, విద్యా సంవత్సరం పూర్తి చేయాలి. 11వ తరగతి ప్రవేశానికి అర్హత అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి చదివి, విద్యా సంవత్సరం పూర్తి చేయాలి. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఈనెల 30 వరకు ఉందని లేటరల్‌ ఎంట్రీ సెలక్షన్‌ టెస్ట్‌ 2027 ఏప్రిల్‌ 10న ఉంటుందని 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు రిజర్వేషన్‌ ఉంటుందని తెలిపారు.

రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికల ఓటర్ల జాబితా విడుదల

జనగామ రూరల్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశానుసారం, జనగామ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసై టీ నిర్వహణ కమిటీ సభ్యుల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా జిల్లా ఉపాధి కల్ప నాధికారి కుమారస్వామిని నియమించారు. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీన అర్హత కలిగిన ఓటర్ల జాబితాను ప్రచురించారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నా, అర్హత కలిగిన సభ్యులు 14వ తేదీలోపు ఎన్నికల అధికారి రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయం, అంబేడ్కర్‌ నగర్‌, జనగామలో లిఖితపూర్వకంగా సమర్పించాలన్నారు. 15వ తేదీన అందిన అభ్యంతరాలు పరిశీలించి, జాబితాలో మార్పులు, చేర్పులపై అభిప్రాయాలను స్వీకరిస్తారు. అనంతరం తుది నిర్ణయం కోసం ె16న రాష్ట్ర శాఖకు జాబితాను పంపించనున్నట్లు తెలిపారు. 19న తుది ఓటరు జాబితా ప్రచురించడంతో పాటు అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement