జనగామ రూరల్: ప్రతీ ఒక్కరు విలువలతో జీవించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా శాఖ, హమ్ సాత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జనగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని, మహ్మద్ ప్రవక్త బోధించిన మానవత, ప్రేమ, దయ, సేవా భావం, సోదరభావం వంటి గొప్ప విలువలను ప్రతీ ఒక్కరు ఆచరించాలని సూచించారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ఆరోగ్యవంతులైన వారు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌మీసా జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్‌ఎన్.రాజు, హమ్ సాత్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా, మహ్మద్ తహసీన్, ఖలీల్, మోహసిన్, జమాల్ షరీఫ్, షకీల్, మసీ ఉర్ రెహ్మాన్, సాజిద్, సలీం, అజారుద్దీన్, నూరుద్దీన్, ఖాళీం, అజీమ్, సయ్యద్ జహంగీర్ హుస్సేన్, ఇస్మాయిల్, ఎజాజ్, అజారుద్దీన్ పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్ర నాయక్


