సంక్షేమ పథకాలకు స్మార్ట్‌ కార్డులే కీలకం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలకు స్మార్ట్‌ కార్డులే కీలకం

Aug 27 2026 1:06 AM | Updated on Aug 27 2026 1:06 AM

లింగాలఘణపురం: భవిష్యత్‌లో సంక్షేమ పథకాలన్నింటికీ స్మార్ట్‌ కార్డులే కీలకం కానున్నాయని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని చీటూరులో రూ.45 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, రూ.34.80 లక్షలతో పాఠశాల గదులు, ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన బుధవారం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేషన్‌ బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా, ఎక్కడి నుంచైనా రేషన్‌ తీసుకొనే విధంగా, ప్రతీ ప్రభుత్వ పథకానికి ఐడీ కార్డులా స్మార్ట్‌ రేషన్‌కార్డు పని చేస్తుందని అన్నారు. మండలంలో 13,803 స్మార్ట్‌ కార్డులు పంపిణీ చేస్తుండగా అందులో 2,228 కొత్త రేషన్‌ కార్డులు జారీ చేశామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోనే స్టేషన్‌ఘన్‌పూర్‌ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే సామాజిక న్యాయం జరుగుతుందని, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. సమావేశాల్లో తహసీల్దార్‌ అండాలు, ఎంపీఓ సుమన్‌, సర్పంచ్‌లు బర్ల గణేష్‌, ఎడ్ల లావణ్యరాజు, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ శివకుమార్‌, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు విజయ్‌మనోహర్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ మోహన్‌, కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement