ఆరోగ్య పుష్టి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య పుష్టి

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

రైతులకు కాసులు కురిపిస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు

జనగామ రూరల్‌: రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆరోగ్య సిరి కలిగిన ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి అధిక విలువైన ఉద్యాన పంటలు రైతులకు ప్రత్యామ్నాయ ఆదా య మార్గంగా నిలుస్తున్నాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటను జిల్లా వ్యాప్తంగా 52 ఎకరాల్లో 20 మంది రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని నర్మెట మండలంలోని గుంటూరుపల్లి గ్రామ రైతులు సంప్రదా య వరి సాగుకు భిన్నంగా ఆలోచిస్తూ, అధిక నీటి అవసరం ఉన్న పంటలకు దూరంగా ఉంటూ పంటల వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామంలో రైతులు సమష్టిగా డ్రాగన్‌ ఫ్రూట్‌, పత్తి, కందులు, కూరగాయలు, తదితర పంటలను సాగు చేస్తూ ఆదాయ మార్గాలను చూసుకుంటున్నారు. అలాగే రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి వద్ద ఓ రైతు 5 ఎకరాల్లో 4 ఏళ్ల నుంచి సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు.

సాగు ఇలా..

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగులో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు డ్రిప్‌ ఇరిగేషన్‌ వంటి సూక్ష్మనీటిపారుదల పద్ధతులు ఉపయోగించుకోవా లి. తోట ఏర్పాటుకు అవసరమైన పందిరి నిర్మాణ ఏర్పాటుకు ఎకరాకు సుమారు రూ.1.35లక్షలు, మొక్కలకు రూ.45వేలు, డ్రిప్‌ ఇరిగేషన్‌న్‌కు రూ.35 వేలు, భూమి తయారీకి రూ.40–50వేలు, బేసల్‌ అప్లికేషన్‌కు సుమారు రూ.20 వేల వరకు వ్యయం అవుతుంది. రెండో సంవత్సరం నుంచి ఎకరాకు సుమారు రూ.73 వేల వరకు నిర్వహణ వ్యయం ఉండగా, సరైన నీటి యాజమాన్యం, పోషకాల వినియోగం, కలుపు నియంత్రణ, తెగుళ్ల నివారణ వంటి శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ స్థిరమైన దిగుబడులు సాధించవచ్చు.

అంతర పంటలతో ఆదాయం

డ్రాగన్‌ ఫ్రూట్‌తో పాటు వివిధ రకాల కూరగాయ పంటలు కూడా రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తాయి. టమాట, వంకాయ, మిరప, బెండ, బీరకాయ, సోరకాయ, కాకరకాయ, ఫ్రెంచ్‌ బీనన్స్‌ వంటి పంటలను మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. టమాటకు ఎకరాకు సుమారు రూ. 96,996 వ్యయం కాగా, సుమారు రూ.4.80 లక్షల స్థూల ఆదాయం, రూ.3.83 లక్షల వరకు నికర రాబడి లభిస్తోంది. అదే విధంగా వంకాయకు రూ. 81,131 వ్యయం కాగా, రూ.3.60 లక్షల స్థూ ల ఆదాయం, రూ.2.79 లక్షల వరకు నిక ర రాబడి వస్తోంది. మిరపలో ఎకరాకు రూ. 76,741 వ్యయంతో రూ.3 లక్షల స్థూల ఆదాయం, రూ.2.23 లక్షల వరకు నికర రాబడి పొందుతున్నారు.

సాగుకు ప్రోత్సాహకాలు

ఉద్యాన సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలు, సాంకేతిక సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా డ్రిప్‌ ఇరిగేషన్‌, నాణ్యమైన మొక్కలు, తోటల ఏర్పాటు, యాజమాన్య పద్ధతులపై సంబంధిత శాఖల నుంచి మార్గదర్శకాలను పొందాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement