రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం శోభన్‌బాబు, పీఈటీ మచ్చ రాజేందర్ సోమవారం తెలిపారు. హనుమకొండ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 23న ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్యారాల కావ్యశ్రీ, శివరాత్రి అక్షయ, పొన్నగంటి సంపత్ అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంిపికయ్యారన్నారు. ఈ నెల 28,29,30 తేదీల్లో హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈసందర్భంగా ఎంపికై న విద్యార్థులను సర్పంచ్ చైతన్య రాజు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రేణుక, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు.
కూనూరు విద్యార్థులు..
జఫర్‌గఢ్: మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బుల్లె అమూల్య, పెద్దపెల్లి భానుశ్రీ, కొలిపాక రిషి వరుణ్, చెవనబోయిన పూజశ్రీ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండీ పర్వేజ్ ఒక ప్రకటనలో తెలి పారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్‌తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.


