భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి

Aug 22 2026 1:23 AM | Updated on Aug 22 2026 1:23 AM

జనగామ రూరల్‌: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సజావుగా కొనసాగేందుకు ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్‌ భూసేకరణ కోసం ప్రభుత్వం వెంటనే రూ.2,800 కోట్లు విడుదల చేసిందని, ఇందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్‌ భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వీసీలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సీతారాం పాల్గొన్నారు.

వీసీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement