● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
నర్మెట: రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, శాసీ్త్రయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంతో పాటు ఇప్పలగడ్డ, గుంటూర్‌పల్లిలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా గురువారం ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం, గోదాము, అంగన్‌వాడీ కేంద్రంతో పాటు క్షేత్రస్థాయిలో డ్రాగన్ ఫ్రూట్, కంది, పెనర, కూరగాయలు, మిర్చి తదితర పంటలను పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. డ్రిప్ విధానంలో తక్కువ నీటితో ఎక్కువ సాగు చేపట్టాలన్నారు. ఇప్పలగడ్డలో గోదాములో నిల్వ సామర్థ్యం, బియ్యం నిల్వలు, నిర్వహణ, సరఫరా ప్రక్రియలను పరిశీలించారు. రైతులకు అదనపు ట్రాన్స్ ఫార్మర్‌ను తక్షణం బిగించే ఏర్పాటు చేయాలని ఎస్‌ఈ సీహెచ్ సంపత్ రెడ్డిని, రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీఏఓ అంబికా సోని, ఏఓ బుర్ర మమత, ఏఈఓ సుంకరి జగదీష్, రైతులు మేకల వెలంగిణి రెడ్డి (డ్రాగన్ ఫ్రూట్), సుధాకర్, వెంకట్ రెడ్డి, భిక్షపతి, మోహన్‌రెడ్డి, రామలింగం తదితరులున్నారు.
జియో నెట్‌వర్క్ సేవలకు అంతరాయం
జనగామ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం జియో మొబైల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 40 నిమిషాలపాటు సెల్ సిగ్నల్ పూర్తిగా నిలిచిపోవడంతో జియో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫోన్‌న్ కాల్స్ కలవకపోవడంతో పాటు మొబైల్ ఇంటర్నెట్ కూడా పని చేయలేదు.


