జనగామ రూరల్: భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆధ్వర్యంలో గురువారం తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఎందరో మహానీయుల ప్రాణ త్యాగాలతో స్వాతంత్రం సిద్ధించిందని, వారి అడుగుజాడల్లో ప్రతీ ఒక్కరు పయనించి దేశ ఐక్యతను చాటాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. పట్ట ణంలోని నెహ్రూపార్క్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. యువత దేశభక్తిని స్ఫూర్తిగా నింపుకొని దేశ పునర్నిర్మాణంలో భాగం కావాలన్నారు. కార్యక్రమంలో కేవీఎల్‌ఎన్ రెడ్డి, సాగర్ రెడ్డి, ఉడుగుల రమేశ్, శివరాజ్ యాదవ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎల్లబోయిన హరీశ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అనిల్, సంతోష్, నాయకులు, మహిపాల్, రాజు, జగదీష్ పాల్గొన్నారు.


