రఘునాథపల్లి : రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయడం లేదని, మొదటిసారి దేవాదుల నుంచి సాగునీరు విడుదల సాధ్యమైందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. గురువారం మండలంలోని అశ్వరావుపల్లిలో సర్పంచ్ పొనగంటి చైతన్య, అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన రిజర్వాయర్ నుంచి సాగు నీటిని విడుదల చేశారు. అనంతరం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నెల రోజులుగా ముందస్తు చర్యలు తీసుకుని దేవాదుల ద్వారా రిజర్వాయర్లను నింపినందు వల్లే ప్రస్తుతం సాగునీరు విడుదల సాధ్యమైందన్నారు. నేడు గండిరామారం, 15న బొమ్మకూరు రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేస్తామని తెలిపారు. రైతులు కొత్తగా వరిసాగు చేయకుండా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. కాల్వల నుంచి వెళ్లే నీరు ఎక్కడ నిరుపయోగం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో 15 రోజులకో మారు సాగునీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గాదె మహేందర్‌రెడ్డి, లింగాజి, క్రాంతికుమార్, మేకల నరేందర్, గొట్టం భాస్కర్‌రెడ్డి, నామాల బుచ్చయ్య, కోళ్ల రవిగౌడ్, లోనె శ్రవణ్‌కుమార్, బాషుమియా, పోకల శ్రీనివాస్, కొమురెల్లి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


