జనగామ రూరల్: పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మినారా యణ అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా కోఆర్డి నేటర్‌ల పోస్టుల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు పార్టీ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను వేగంగా చేరవేసే విధంగా సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్కాలర్‌షిప్‌లను దారి
మళ్లించిన ప్రభుత్వం
జనగామ రూరల్: విద్యార్థుల స్కాలర్‌షిప్ నిధులను దారి మళ్లించి వారి భవిష్యత్‌తో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆడుకుంటున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్‌లో బీసీ బహుజన విద్యార్థి యువ చైతన్య సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా విద్యా వ్యాపారం చేస్తున్న రాజకీయ నాయకుల తీరుపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందాల్సిన రూ.1,900 కోట్ల స్కాలర్‌షిప్ నిధుల్లో కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసి, మిగిలిన సొమ్మును ప్రభుత్వం ఇతర పనులకు దారి మళ్లించిందని ఆరోపించారు. పోలీసు శాఖలోని ఒక కుక్క ఆహారం కోసం నెలకు 16,000 రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, హాస్టల్‌లో ఉండి చదువుకునే పేద బిడ్డలకు కనీసం రూ.2000 కూడా ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రాజకీయం విద్యా వ్యాపార వేత్తల చేతుల్లో బందీ అయిందని విమర్శించారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున జనగామ నియోజకవర్గ మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ భిక్షపతిని అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సదానందం, పిట్టల నరేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


