● సమీక్షలో కలెక్టర్
సందీప్ కుమార్ ఝా
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో జనగామ జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీకాన్ఫరెన్స్‌హాల్‌లో ఎస్‌ఐఆర్‌పై కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 99.79 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడంతో రాష్ట్రంలో మనమే ముందు వరుసలో ఉన్నామన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి మించి ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదు కాకుండా అందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాశ్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, రాజకీయ పార్టీల నాయకులు రావెల రవి, పెద్దోజు జగదీశ్, బి.భాస్కర్, యు.రవి యాదవ్, జోగు ప్రకాష్, శ్రీని వాస్ తదితరులు పాల్గొన్నారు.


