జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమై న విద్య అందించడమే లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం జనగామ మండలంలోని గోపరాజుపల్లి గ్రామంలోని ప్రాథమికో న్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని ప్రతీ తరగతి గదిని సందర్శి స్తూ విద్యార్థులతో మాట్లాడి, వారి అభ్యాస సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులు పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటూ స్పష్టంగా చదివేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాల లో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. అనంత రం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఎయి డ్స్ నియంత్రణకు సమష్టి కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. శుక్రవారం జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ, జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ నివారణకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు పరీక్షలను మరింత విస్తరించాలని సూచించారు. ఈ సమీక్షలో డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రావ్య, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై హౌసింగ్ అధి కారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్ష సమావేశం ని ర్వహించారు. నిర్మాణ ప్రక్రియను లబ్ధిదారులు వే గంగా పూర్తి చేసేలా క్షేత్ర స్థాయిలో అధికారులు ప్ర తీరోజు 5 గ్రామాలను సందర్శించి పర్యవేక్షణ చే యాలన్నారు. సమావేశంలో హోసింగ్ పీడీ మాతృనాయక్, మండల అధికారులు పాల్గొన్నారు .
ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి
బచ్చన్నపేట: వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎద్దుగూడెం గ్రామ రైతులు సాగు చేసిన పంటలను శుక్రవారం పరిశీలించి వారితో మాట్లాడారు. నాటు వేస్తున్న మహిళా కూలీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


