చిన జీయర్‌ స్వామికి ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

చిన జీయర్‌ స్వామికి ఘన స్వాగతం

Jul 19 2026 1:32 AM | Updated on Jul 19 2026 1:32 AM

జనగామ: జిల్లా కేంద్రంలోని బాణాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కా ర్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరు కానున్న చిన జీయర్‌ స్వామికి పట్టణంలో శనివారం భక్తులు ఘ న స్వాగతం పలికారు. ఓపెన్‌ టాప్‌ జీపులో శోభా యాత్రగా జనగామ చౌరస్తా నుంచి నెహ్రూపార్కు, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం మీదుగా బాణాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకోగా భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. జూలై 23 వరకు స్వామి వారి పర్యవేక్షణలో మహా సుదర్శనయాగం, ప్రత్యే క పూజలు, వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ అర్చకులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి, వైటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు డాక్టర్‌ లక్ష్మి నా రాయణనాయక్‌, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, వి కాస్‌ తరంగిణి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement