హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు శనివారం నాలుగో రోజుకు చేరాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కురుకుల్లాక్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి బోగభేరాన్ని భేరుండా క్రమంలో అలంకరించి నవరాత్ర విశేషపూజలు నిర్వహించారు. సాయంత్రం కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ అమ్మవారిని దర్శించుకున్నారు.
కురుకుల్లా ,భేరుండా క్రమంలో అమ్మవారు


