జఫర్‌గఢ్: చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభా గాలను పరిశీలించారు. వంట గదిని తనిఖీ చేసి విద్యార్థినులకు అందిస్తున్న అహార నాణ్యత డైట్ చార్జీల అమలు, ప్రతీ రోజు వండుతున్న భోజన పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోనాయిచలం రెవెన్యూ పరిధిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన సముదాయ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
జిల్లాలోని ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్
కొడకండ్ల: విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మండల కేంద్రంలోని బాలికల గురుకులాన్ని కలెక్టర్ సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, వసతులు, సదుపాయాలను పరిశీలించారు. జీసీడీఓ గౌసియాభేగం, తహసీల్దార్ అనీల్‌బాబు, ఎంపీడీఓ రవిందర్, సర్పంచ్ మమతసతీష్‌గౌడ్, ప్రిన్సిపాల్ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాపార రంగంలో రాణించాలి
జనగామ రూరల్: మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించాలని, ఆదాయ వనరులను సమకూర్చుకునేలా పెద్ద యూనిట్ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్‌లో సీ్త్రనిధి రుణాలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ‘మన సీ్త్రనిధి’ మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా సూపర్‌మార్ట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్డీఓ పీడీ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, సీ్త్రనిధి జోనల్ మేనేజర్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు, సీ్త్రనిధి డైరెక్టర్ పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ


