నేడు డయల్ యువర్ డీఎం
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. ఈనెల 31న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్–1 డిపో నుంచి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్ చేసి విలువైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
వీరాచల రాముడికి రూ.1,00,116ల విరాళం
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయానికి మంగళవారం కొండ ప్రమోద్‌రాజాపద్మిని దంపతులు(యూఎస్‌ఏ) రూ.1,00,116ల విరాళ ం అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం వీరాచల రామచంద్రున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారి భార్గవాచార్యులు, ఆలయ సిబ్బంది భరత్, మల్లేశంలకు అందజేశారు.
లింగంపల్లి జాతర ప్రదేశం పరిశీలన
చిల్పూరు: మండలంలోని లింగంపల్లి సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహించే ప్రదేశాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ మంగళవారం పరిశీలించారు. ముందుగా తల్లుల గద్దెల వద్ద సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్‌లతో కలిసి పూజలు చేశారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. జనవరి 28నుంచి 30 తేదీ వరకు నిర్వహించే జాతరకు పెద్ద మొత్తంలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు గడ్డమీది సురేశ్, కండ్లకోలు బాలరాజు, ఏదునూరి రవీందర్, తుత్తురు రాజు తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు
జనగామ రూరల్: తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పన శిక్షణ శాఖ, జనగామ జిల్లా ఆధ్వర్యంలో జర్మనీలో నర్సులకు ఉచిత జర్మన్ భాషా శిక్షణ ఉద్యోగ నియామక సహాయం టామ్‌కామ్ ద్వారా అందిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి సాహితి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం నమోదు పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ద్వారా అర్హత కలిగిన నర్సులకు ఉచిత జర్మన్ భాషా శిక్షణ అందించి, జర్మనీలో పేరొందిన ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. 22 నుంచి 38 ఏళ్లు ఉండి బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం పూర్తి చేసి 1 నుంచి 3 సంవత్సరాల క్లినికల్ అనుభవం ఉండాలన్నారు. జర్మన్ భాషా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత జర్మనీలో స్టాఫ్‌నర్స్‌గా నియమితులైన వారికి నెలకు సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆకర్షణీయమైన వేతనం ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలు, నమోదు కోసం 9440051581 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
రోబోటిక్స్‌పై వర్క్‌షాపు
రఘునాథపల్లి: మండలంలోని వెల్ది మోడల్ స్కూల్‌లో మంగళవారం రోబోటిక్స్ ఐదో స్థాయి డైమండ్ చాలెంజ్ వర్క్‌షాపు జరిగింది. వర్క్‌షాపును ఇన్‌స్ట్రక్టర్ నడిగోటి సుహాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల రోబోటిక్స్ ఇన్‌చార్జ్ ఉపాధ్యాయులు ద్యావత సౌజన్యప్రియ, పోరిక పార్వతి మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు జరుగుతుండగా అందులో వెల్ది పాఠశాల ఉందన్నారు. విద్యార్థులు రోబోటిక్స్ సాధన చేసి వైఫై రోబోట్, రోటరీ ఎన్ కోడర్ కంట్రోల్డ్ లెడ్ సర్వో అండ్ బజర్, ఆటోమెటిక్ లైటింగ్ అండ్ విసిటింగ్ కౌంటర్ అనే మూడు యాక్టివిటీస్ చేశారని చెప్పారు. పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ కందగట్ల గణేష్ వర్క్‌షాపును సందర్శించి విద్యార్థులను అభినందించారు.
నేడు డయల్ యువర్ డీఎం
నేడు డయల్ యువర్ డీఎం


