అభివృద్ధిలో వెనకడుగు
నత్తనడకన సుందరీకరణ, రహదారులు, రిజర్వాయర్ల పనులు
జనగామ:
జిల్లా అభివృద్ధిలో ఆశించిన పురోగతి సాధ్యం కాలేదు. కొన్ని రంగాల్లో ముందడుగు పడినా, కీలకమైన ప్రాజెక్టులు నిలిచిపోవడం వల్ల ప్రజాసమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయి.జిల్లా కేంద్రంలో సుందరీకరణ పనులు ఆశించినంత వేగం అందుకోలేదు. బతుకమ్మకుంటను రూ.1.50 కోట్లతో అభివృద్ధి చేసినప్పటికీ, ప్రజా భాగస్వామ్యం కనిపించలేదు. నగర అభివృద్ధికి కీలకమైన కళావేదిక, శాశ్వత మరుగుదొడ్లు ఇప్పటికీ అమలు దిశలోకి రాలేదు. జిల్లా ప్రధాన వనరులలో ఒకటైన రంగప్పచెరువు సుందరీకరణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. జనగామ–హైదరాబాద్ మెయిన్ రోడ్ పనులు సగంలోనే ఆగిపోవడంతో రహదారి సగం బ్లాక్‌టాప్, సగం కంకర రోడ్డుగా మారి నాలుగేళ్లుగా ప్రజలకు తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. పెంబర్తి–మడికొండ ఇండస్ట్రియల్ కారిడార్‌కు పురోగతి కనిపించలేదు. జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలు ప్రారంభమయ్యాయి. చంపక్ హిల్స్‌లో రూ.100 కోట్లతో జిల్లా కోర్టుల నిర్మాణం మొదలైంది. అదే ప్రాంతంలో ట్రామా సెంటర్ భవనం సిద్ధమైంది. విద్యారంగంలో 3,5,6 తరగతుల న్యాస్ పరీక్షల్లో జనగామ దేశవ్యాప్తంగా 782 జిల్లాల్లో 50లో చోటు దక్కించుకొని ప్రతిభ చాటుకుంది. వార్షిక పరీక్షల్లో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఇంకుడు గుంతల నిర్మాణంలో జిల్లా దేశవ్యాప్తంగా ఉత్తమంగా నిలిచింది. పాలిటెక్నిక్ కళాశాల మాత్రం కాగితాలకే పరిమితమై పోయింది. అభివృద్ధి పనులు కనిపించినా, కీలకమైన రహదారులు, రిజర్వాయర్లు, ప్రభుత్వ భవనాల పనులు నిలిచిపోవడంతో జిల్లా అభివృద్ధి రెండు అడుగులు ముందుకు వేస్తే మూడు అడుగులు వెనక్కిపడిన పరిస్థితి కనిపిస్తోంది.
స్టేషన్ ఘన్‌పూర్‌లో నెమ్మదిగా 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులు
రంగప్ప చెరువు, కళావేదిక అభివృద్ధి జాడలేదు
పాలకుర్తి–చెన్నూరు రిజర్వాయర్లకు నిధులున్నా పురోగతి లేదు
వడ్లకొండ, చీటకోడూరు బ్రిడ్జిల నిర్మాణం గాలికి..
విద్యారంగంలో కాస్త ముందుకు..
మండలాల వారీగా
జనగామ మండలం: నర్మెట హైవే, వడ్లకొండ, చీటకోడూరు రహదారులపై కల్వర్టులు, బ్రిడ్జిలు కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినా పనులు నిలిచిపోయాయి. రూ.5 కోట్ల మంజూరు ఉన్నప్పటికీ బిల్లులు రాక పనులు ఆగిపోయాయి.
లింగాలఘణపురం: వరంగల్–హైదరాబాద్ హైవే నెల్లుట్ల వద్ద ప్రమాదాలకు కారణమవుతున్న పాత బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మాణంలో అధికారులు అలసత్వం ప్రాణానికి ముప్పు తెస్తోంది. రూ.8 కోట్లతో ప్రారంభించిన కళ్లెం రోడ్డు కూడా ఇంకా పూర్తి కాలేదు.
స్టేషన్ ఘన్‌పూర్: రూ.45 కోట్ల ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి, రూ.26 కోట్ల కార్యాలయాల సముదాయం, రూ.1 కోటి డీఈ కార్యాలయ నిర్మాణం, మల్లన్నగండి రహదారి, జాతీయ రహదారి సర్వీస్ రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రిజర్వాయర్ పర్యాటక ప్రాజెక్టుల పనులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. రూ.146 కోట్లతో తలపెట్టిన స్టేషన్‌న్ ఘనన్‌పూర్–నవాబుపేట ప్రధాన కాల్వ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. లెదర్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు.
జఫర్‌గఢ్ : కోనాయచలంలోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ఇప్పటికీ మొదలుకాలేదు.
చిల్పూరు : మల్లన్నగండి రిజర్వాయర్ నుంచి లింగంపల్లి–శ్రీపతిపల్లి–కొడాపూర్ గ్రామాలకు నీటి సరఫరా కోసం రూ.104 కోట్లతో చేపట్టిన పైప్‌లైన్ పనులు పూర్తయినా, గేట్ వాల్వ్‌లు నిలిచిపోవడంతో నీటి తరలింపు ప్రారంభం కాలేదు.
తరిగొప్పుల: రూ.1.43 లక్షలతో తలపెట్టిన పీహెచ్‌సీ భవనానికి సంబంధించి స్థల కేటాయింపు పనులు నిలిచిపోయాయి.
బచ్చన్నపేట: రూ.8.30 కోట్ల మంజూరు ఉన్నా, మట్టి–బీటీ రోడ్ల పనులకు టెండర్లకు నోచుకోవడం లేదు.
కొడకండ్ల: రూ.9 కోట్లతో రెండు చెక్‌డ్యాంలు, రూ.94 లక్షలతో కస్తూర్బా పాఠశాల అదనపు గదుల నిర్మాణం పూర్తయింది.
పాలకుర్తి: శ్రీ సోమేశ్వర–లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, సోమనాథ స్మృతివనం, కల్యాణ మండపం ఆధునికీకరణకు రూ.94.84 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఒక్క పని కూడా మొదలుకాలేదు. పాలకుర్తి–చెన్నూరు రిజర్వాయర్ పనులకు రూ.1000 కోట్ల రీ–ఎస్టిమేట్ నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు నత్తనడకన సాగుతుండగా, చెన్నూరు రిజర్వాయర్ పనులు ప్రారంభం కాలేదు.
అభివృద్ధిలో వెనకడుగు
అభివృద్ధిలో వెనకడుగు
అభివృద్ధిలో వెనకడుగు


