నేడు వైకుంఠ ఏకాదశి
జనగామ: ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకునే శుభపర్వాన్ని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసం శుక్ల పక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఈ పర్వదినం. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి వరకు జరిగే కాలంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి చిల్పూరు బుగులు శ్రీ వెంకటేశ్వరస్వామి, జిల్లా కేంద్రంలోని బాణాపురం వెంకటేశ్వరస్వామి, పాతబీటు బజారులోని శ్రీ చెన్నకేశ్వరస్వామి, జీడికల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
విద్యుత్‌కాంతుల్లో వైష్ణవాలయాలు


