గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష పోస్టర్ ఆవిష్కరణ
జనగామ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన ఖాళీల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ తెలిపారు. సోమవారం ప్రవేశ పరీక్ష వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, డీఎస్‌ఈ డీఓ డా.విక్రమ్, ఏ బీసీడీఓ రవీందర్, డీసీఓ ఎ.శ్రీనివాస్, గురుకులాల డీసీఓ పి.శ్రీనివాసరావు, అజ య్ పాల్గొన్నారు. అలాగే ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సి పాల్ ఎస్.స్వరూప ఒక ప్రకటనలో తెలిపారు.


