గుడ్ వర్కింగ్ సొసైటీగా నర్మెట పీఏసీఎస్
నర్మెట: గుడ్ వర్కింగ్ సొసైటీగా నర్మెట పీఏసీఎస్ ఎంపికై ంది. వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌కు అనుబంధంగా ఉన్న నర్మెట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మూడేళ్లుగా రైతులకు అందజేసిన స్పల్ప, దీర్ఘకాలిక రుణాలను సకాలంలో వసూలు చేయడంతో ప్రభుత్వం అందించే 3 శాతం రాయితీకి అర్హత సాధించింది. దీంతో రైతుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ అయ్యింది. సొసైటీ ఎలాంటి ఇన్‌బ్యాలెన్స్, నష్టాలు లేకపోవడం అవార్డుకు ఎంపికై ంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సహకార, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా సొసైటీ సీఈఓ కొన్నె వెంకటయ్య అవార్డు అందుకున్నారు.
గణతంత్ర వేడుకలకు
ఒగ్గు రవి బృందం ఎంపిక
లింగాలఘణపురం: ఢిల్లీలోని కర్తవ్యపఽథ్ వేదికగా 2026 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒగ్గుడోలు విన్యాస కళాప్రదర్శనను ఎంపిక చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంట్రల్ నుంచి జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కళాకారుడు ఒగ్గు రవికి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. 26న రాష్ట్రపతి, ప్రధానమంత్రి సమక్షంలో ప్రదర్శన ఇవ్వనున్నామని, రాష్ట్రం నుంచి ఒగ్గుడోలు ప్రదర్శన ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.
గుడ్ వర్కింగ్ సొసైటీగా నర్మెట పీఏసీఎస్


