న్యూఇయర్ జోష్ షురూ!
● విందులు, వినోదాలకు యూత్ రెడీ
● జోరుగా కేక్‌లు, గిఫ్టుల అమ్మకాలు
జనగామ: పాత జ్ఞాపకాలను గుర్తుకుచేసుకుంటూ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాది 2026కు స్వాగతం చెప్పేందుకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈనెల 31 (బుధవారం) అర్ధరాత్రి వేడుకలకు రెస్టారెంట్లు, హోటళ్లు, ఈవెంట్ వేదికలు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. యువత నుంచి కుటుంబాల వరకు అందరూ విందు, వినోదాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. వ్యాపారులు ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లను రప్పించేందుకు పోటీపడుతున్నారు. బొకేలు, గిఫ్ట్ ఐటమ్స్, కేకుల అమ్మకాలు భారీగా పెరిగి పండగ మార్కెట్‌ను తలపిస్తున్నాయి.
కేకుల పండగ
కొత్త సంవత్సర వేడుకల కోసం ఒక్కో బేకరీలో వందల సంఖ్యలో కేక్‌లను తయారు చేస్తున్నారు. చూడగానే తినేయాలనిపించే విధంగా కేకులు ఆకర్షిస్తున్నాయి. అరకిలో నుంచి 20 కిలోల వరకు కేకులు అందించేందుకు దుకాణా యజమానులు ఆర్డర్లను బట్టి తయారు చేస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు.
న్యూఇయర్ జోష్ షురూ!


