పారదర్శకంగా యూరియా పంపిణీ
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
స్టేషన్‌ఘన్‌పూర్: యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతులకు సులభంగా, పారదర్శకంగా, అవసరానికి అనుగుణంగా యూరియా బస్తాల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. యాప్ ద్వారా జరుగుతున్న యూరియా అమ్మకాలను స్వయంగా పరిశీలించేందుకు స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని పీఏసీఎస్‌ను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. రాష్ట్రంలో యూరి యా బుకింగ్‌యాప్‌లో జిల్లా ముందంజలో ఉంద న్నారు. ఆయన వెంట డీసీపీ రాజమహేంద్రనాయ క్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని, ఆర్‌డీ ఓ డీఎస్ వెంకన్న, సీఐ జి.వేణు, ఎస్‌ఐలు వినయ్ కుమార్, రాజేష్, డీటీ సంఽధ్యారాణి, ఏఓ చంద్రన్‌కుమార్, పీఏసీఎస్ సీఈఓ మగ్ధుంఅలీ పాల్గొన్నారు.
చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే
జనగామ రూరల్: విద్యార్ధులకు కేవలం చదువు మాత్రమే కాకుండా క్రీడలు కూడా ముఖ్యమేనని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జిల్లాస్థాయి పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థుల క్రీడాపోటీలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఈఈ సత్యనారాయణమూర్తి, సీఎంఓ నాగరాజు, సెక్రటరీ గొర్సింగ్, ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు. పీఎంశ్రీ క్రీడాపోటీల్లో వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ బహుమతులు అందజేశారు.
మీ చేతుల్లోనే మీ భవిష్యత్..
మీ చేతుల్లోనే మీ భవిష్యత్ ఉందని, ప్రాణాలు అతి ముఖ్యమని రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పట్టణంలోని ఎన్‌మ్‌ఆర్ గార్డెన్‌లో రోడ్డు భద్రత ప్రమాద నివారణపై ఆర్టీఏ సభ్యుడు అభి గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, రవాణా శాఖ అధికారి శ్రీని వాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


