ప్రత్యేక తరగతులు
టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు
సర్కారు స్కూళ్లలో 62.. ప్రైవేట్‌లో 12 మంది
● అడ్వాన్స్‌డ్ పరీక్షలకు సన్నద్ధం
● తెలుగులో తప్పిన
ఎక్కువ మంది విద్యార్థులు
జిల్లాలో 10 వార్షిక పరీక్షల్లో
ఫెయిల్ అయిన విద్యార్థుల బడులు
జనగామ: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థు ల కోసం జిల్లా విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. జిల్లాలోని 37 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో 62, ప్రైవేట్ స్కూళ్లలో 12 మంది మొత్తం 74 మంది ఫెయిల్ అయ్యారు. వీరు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విధంగా డీఈఓ భోజన్న నేతృత్వంలో ప్రత్యేక తరగతులు ఇప్పిస్తున్నారు. వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థులకు ఉదయం రెండు గంటలపాటు ఫెయిల్ అయిన సబ్జెక్టుకు సంబంధించి బోధన చేస్తూ.. రిటన్ టెస్ట్ సైతం నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక పర్యవేక్షణ
జిల్లాలో ఫెయిల్ అయిన టెన్త్ విద్యార్థులకు సంబంధించి డాటా తయారు చేసి.. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, సబ్జెక్టు టీచర్లకు అందజేశారు. రోజూ సదరు విద్యార్థులకు ఫోన్ చేసి బడికి వచ్చేలా చూడాలి. సబెక్జులకు సంబంధించి బోధనతో పా టు పరీక్ష నిర్వహించి ఎన్ని మార్కులు వస్తున్నాయో పరిశీలించారు. రోజువారి కార్యాచరణకు సంబంధించి ఫొటో రూపంలో డీఈఓ వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేయాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థుల కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడకుండా విద్యాశాఖ తీసుకున్న ప్రత్యేక తరగతుల నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగులో అత్యధికంగా..
టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థుల్లో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి అత్యధికంగా 51 మంది ఉన్నారు. సైన్స్‌లో 17, సాంఘికశాస్త్రంలో 16, గణితంలో 9, ఇంగ్లిష్‌లో 12, హిందీలో 4 మంది ఉన్నారు. జూన్ 3వ తేదీ నుంచి పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానుండగా, అప్పటి వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి.
మండలం పాఠశాలల
సంఖ్య
బచ్చన్నపేట 4
చిల్పూరు 1
దేవరుప్పుల 4
స్టేషన్‌ఘన్‌పూర్ 4
జనగామ 9
కొడకండ్ల 1
లింగాలఘణపురం 2
నర్మెట 1
పాలకుర్తి 4
రఘునాథపల్లి 3
జఫర్‌గఢ్ 4
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం..
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వందశాతం ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. జిల్లాలో 37 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 62 మంది ఫెయిల్ అయ్యారు. సబ్జెక్టుల వారీగా పిల్లలకు ప్రతీ రోజు బోధన, ఆ తర్వాత స్లిప్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. పిల్లవాడి పఠనా సామర్థ్యాన్ని బట్టి బోధన చేయిస్తున్నాం.
– భోజన్న, డీఈఓ, జనగామ
ప్రత్యేక తరగతులు
ప్రత్యేక తరగతులు


