
శిశువు మృతి ఘటనపై విచారణ
పాలకుర్తి టౌన్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కి వచ్చిన గర్భిణి కడుపులో శిశువు మృతి చెందిన ఘటనపై కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్‌ఓ మల్లికా ర్జున్‌రావు గురువారం విచారణ చేపట్టారు. గర్భిణి ఎప్పుడు ఆస్పత్రిలో చేరింది. ఆమెకు చేసిన పరీక్షలు ఏమిటి. ఇచ్చిన మందుల వివరాలతోపాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది సమా చారం తెలుసుకున్నారు. అలాగే గర్భిణిని జనగామ ఎంసీహెచ్‌కు ఎందుకు రెఫర్ చేయలేదు.. చేస్తే వారు వెళ్లలేదా.. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎవరు సూచించారు.. బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించిన అంశాలపై విచారణ చేపట్టారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విచారణలో అడిషనల్ డీఎంహెచ్ ఓ రవీందర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధీర్, డాక్టర్ సిద్ధార్ధరెడ్డి పాల్గొన్నారు.
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణం
పలు కోణాల్లో విచారణ చేపట్టిన డీఎంహెచ్‌ఓ ఈ ఘటనకు వైద్యులతో పాటు ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. బాధ్యులైన గైనకాలజి స్ట్ డాక్టర్ కె.అపర్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజులుగా విధులకు రాకుండా పర్యవేక్షణ లోపానికి కారణమైన సూపరింటెండెంట్ డాక్టర్ పరమేశ్వరిని సస్పెండ్ చేయడానికి కమిషనర్ వైద్య విధాన పరిషత్‌కు రెకమండ్ చేశా రు. అలాగే ఆస్పత్రికి వచ్చిన గర్భిణి అర్చన విషయంలో అమర్యాదగా వ్యవహరించిన స్టాఫ్‌నర్సు జె.నీల, ఎంపీహెచ్‌ఏ కృష్ణవేణిలకు మెమో జారీ చేశారు. కొద్దిరొజులుగా విధులకు గైరాజరవుతున్న జీడీఎంఓ భరత్‌ను విధుల నుంచి తొలగించారు. గర్భిణిని సకాలంలో ఉన్నత ఆస్పత్రికి రెఫర్ చేయడంలో నిర్లక్ష్యం వహించి డాక్టర్ స్వప్నకు సైతం మెమో జారీ చేశారు.
ఇద్దరు వైద్యుల సస్పెన్షన్
పలువురికి మెమోలు జారీ